Tula rasi phalalu 2022 to 2023

Sree Shubhakruth Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

Tula rasi phalalu 2022 to 2023

  • చిత్త 3,4 పాదములు లేదా స్వాతి 1,2,3,4 పాదములు లేదా విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులారాశికి చెందును.
  • శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 08, రాజ పూజ్యం - 07, అవమానం - 09

  • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తులా రాశి వారికి భూ సంబంధ , గృహ సంబంధ విషయాల్లో లాభాలను, ఆరోగ్య విషయాల్లో తరచుగా చికాకులు ఏర్పడుటను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....

తులారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో అనగా 02-ఏప్రిల్-2022 నుండి 21-మార్చ్-2023 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన తగాదలలో విజయం, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనే అధిక కోరికను, చిన్న వయస్సులోనే చందాస స్వభావం అలవడుటను, విద్యార్ధులకు విద్య నుంచి ఇతర వ్యాపకాలపై దృష్టి మరలునట్లు చేయుట, సంగీత రంగంలోని కళాకారులకు భాగ్య హీణత వంటి ఫలితాలు ఎదురగును. గురువు వలన ఇతర తీవ్ర సమస్యలు ఏర్పడవు.

తులారాశి వారకి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో శని వలన బాగా కలసి వస్తుంది. ముఖ్యంగా భూ , గృహ సంపదలు ఆశించిన విధంగా ఏర్పరచుకోనగలరు. పరదేశ స్థాన చలన ప్రయత్నాలు ఈ సంవత్సరం విజయవంతం అవుతాయి. మాతృ వర్గీయుల అర్రోగ్య విషయంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆలోచనా విధానం మెరుగు పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సౌఖ్యం మాత్రం ఉండదు. పనిభారం అధికం అవుతుంది. సంవత్సరం ద్వితియార్ధంలో ఉన్నత అధికారుల వలన బాధలు ఎదురగును. ఆర్ధిక విషయాలలో అత్యాశ వలన దుఃఖములు ఎదుర్కొందురు. రాజకీయ నాయకులకు  సంవత్సరం అంతా మానసిక ఆందోళన ఎదురగును. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొందురు. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి  జూలై 2022, ఆగష్టు 2022, నవంబర్ 2022, జనవరి 2023 మాసములు సంతాన సౌఖ్యం ఏర్పరచును. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

తులారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాహువు వలన వైవాహిక జీవనంలో ఇబ్బందులు ఎదురగును. ఈ సంవత్సరం అంతా జీవిత భాగస్వామి తో గౌరవంగా విదేయతతో మెలగాలి. నీచ లేదా అల్ప బుద్ది కలిగిన వ్యక్తులతో పరిచయాల వలన కుటుంబ జీవనం పడుచేసుకోను సూచనలు ఉన్నవి.  అవివాహితుల వివాహ ప్రయత్నాలు అంత త్వరగా ఫలించవు. శ్రీకాళహస్తి లేదా రామేశ్వరం లో రాహు దోష నివారణ పూజలు జరిపించుకోనుట వివాహ సంబంధాలలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఆర్ధిక అంశాలలో రాహువు వలన ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు ఏర్పడవు. రాహు ప్రభావం వలన తులారాశి వారు ఈ సంవత్సరం కొద్దిపాటి గర్వం ప్రదర్శించెదురు. 

తులారాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కేతువు వలన కుల సంబంధ విషయాలలో చికాకులు, మీకు సంబంధం లేని పనుల కోసం శారీరక శ్రమ అధికమగుట మరియు ధన వయం చేయవలసి వచ్చుట,  మధ్య వయస్సు వారికి ములశంఖ వంటి మూలాధార సమస్యలు, పెద్ద వయస్సు వారికి హృదయ సంబంధ సమస్యలు, పురుషులకు స్త్రీ సంబంధ విషయములలో అత్యాశ వలన చికాకులు, ఉద్యోగ జీవనంలో అఖస్మిక ఉద్యోగ నష్టము, వ్యాపార వ్యవహరాదులలో అశ్రద్ధ , ధన సుఖ రాహిత్యత వంటి చికాకులు ఎదురగును. మొత్తం మీద శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో తులారాశి వారికి రాహు-కేతువులు ఇరువురూ అంతగా మంచి ఫలితాలు ఇవ్వరు. శనైచ్చరుని వలన మాత్రం చక్కటి అభివృద్ధి ఉంటుంది. 

ఏప్రిల్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రారంభించిన నూతన వ్యవహారములు, ప్రయత్నములు సానుకూలంగా ముగియును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. గత కాలంలో ఆపివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు కూడా ఇది మంచి సమయం. నిరుద్యుగుల, విద్యార్ధుల కోరికలు నెరవేరును. అవసరానికి ఆశించిన ఆర్ధిక సర్దుబాటు జరుగును. కుటుంబంలో సంతోషకర సమయాలు ఏర్పడతాయి. 18 నుండి 22 వ తేదీ మధ్యకాలంలో చక్కటి వాహన సౌఖ్యం ఉన్నది. చివరి వారంలో స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడును. ఈ మాసంలో 4 నుండి 16 వ తేదీ మధ్య అన్నిరకముల ప్రయత్నాలు కలసివచ్చు సమయం.

మే 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో బంధు వర్గం వలన ఒక ఆర్ధిక నష్టం ఏర్పడు సూచన ఉన్నది. వివాహ మరియు సంతాన ప్రయత్నాలో ప్రతికూలత బాధించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. ప్రారంభించిన కార్యములు సకాలంలో పూర్తి అవ్వవు. మీపై ఏర్పడిన విమర్శల వలన మానసిక అశాంతి అనుభవించేదురు. ఆర్ధికంగా ఇబ్బందులకు అవకాశం ఉన్నది. ఈ మాసంలో చేసే అన్ని రకముల కొనుగోళ్ళ కు సంబందించిన నిర్ణయాల పట్ల స్థిరత్వం అవసరం. ఈ మాసంలో ,9,13,14,25 వ తేదీలు ఆర్ధికంగా అనుకూలమైనవి కావు. స్టాక్ మార్కెట్ లో సాహసోపేతమైన పెట్టుబడులకు ఈ మాసం అంత అనుకులమైంది కాదు.

జూన్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సానుకూల పరిస్థితులు ఏర్పడును. మీ ఉద్యోగ జీవనంలో పై అధికారుల వలన లాభాములుండును. పదోన్నతికై లేదా ఉద్యోగ మార్పుకు , గృహాలపై పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం బాగా కలసి వచ్చును. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల వలన కూడా కలసివచ్చును. సంతాన ప్రయత్నాలు ఫలించును. రావలసిన ధనం చేతికి వచ్చును. వ్యక్తిగత జీవితంలో చక్కటి సుఖ సంతోషాలు ఉన్నవి. మీ సంతానం సాధించిన విజయాల వలన చక్కటి ఆనందాన్ని అనుభవించెదరు. ఆరోగ్య సమస్యలు తగ్గును. స్త్రీలకు మాతృ వర్గం వారి వలన ధనం లభించును. ఈ మాసం చివరి వారం ఉద్యోగ జీవనంలో మంచి అభివృద్ధిని ఏర్పరచును.

జూలై 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ అర్ధభాగం చక్కటి అనుకూల ఫలితాలు, ఆశించిన లాభాలు ఏర్పరచును. నూతన ఆదాయ మార్గాలు ప్రారంభం అగును. సొంత వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించును. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. తృతీయ వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో చిన్న తగాదా. మాస ద్వితియార్ధంలో స్థాన చలన సంబంధ ప్రయత్నాలు విఫలం అగును. ప్రస్తుత నివాస గృహాన్ని మార్చవలసి వచ్చును. గొంతు సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడుటకు సూచనలు కలవు. కుటుంబ సభ్యులతో వ్యవహరించునపుడు పట్టు విడుపులు అవసరం. ఖర్చు విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు జరపడం మంచిది. చివరి వారంలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయానములు ఫలప్రదం అవుతాయి .

ఆగష్టు 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రారంభించిన పనులు ప్రారంభంలో ఆటంకములు ఎదుర్కొని చివరికి కష్టం మీద పూర్తి అగును. అకారణంగా అనుమానించబడు సంఘటనలు ఎదురగు సూచన ఉన్నది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు ఏర్పడును. వ్యాపార వ్యవహారములు సామాన్యం. ఉద్యోగ జీవనం కుడా సామాన్య యోగంతో కొనసాగును. ఈ మాసంలో స్పెక్యులేషన్ పరంగా పెట్టుబడులు లాభించవు. 24 నుండి 28 వ తేదీ మధ్య కాలంలో చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉన్నవి.

సెప్టెంబర్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. మీ మంచి గుణములకు అందరి ప్రశంశలు లభిస్తాయి. మీ కార్య నిపుణత పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. బంధు వర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోవును. వారి సంపూర్ణ సహకారం లభించును. ఆరోగ్య విషయాలు కూడా సహకరించును. తృతీయ వారంలో దాన ధర్మాలలో పాల్గొంటారు. యువతకు ఆద్యాత్మిక చింత అలవడుతుంది. జీవన ముఖ్య విషయములందు సుక్ష్మ బుద్ధితో ఆలోచించేదరు. 28,29,30 తేదీలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి న్యాయమైన ధనార్జన చేయు ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

అక్టోబర్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపారములు అంత సవ్యంగా ఉండవు. ఈ మాసం మాత్రు వర్గీయులకు ఆరోగ్య పరంగా మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలెను. మొదటి రెండు వారములు కృషి ములకంగా ధనలాభాములు, ప్రసిద్ధ వ్యక్తులతో పరిచయాలు, వివాహ సంబంధ శుభవార్తలు వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును. తృతీయ వారములో దైవ కార్య ప్రీతి, సంతాన లాభములు, జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యల నుండి ఉపశమనం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును. చివరి వారంలో ముఖ్యంగా 26 వ తేదీ తదుపరి వృధా ఖర్చులు ఏర్పడుట, కోప స్వభావం వలన అవకాశములు వదులుకొనుట మరియు తన్ములక తగాదాలు ఎదుర్కొందురు.

నవంబర్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో దీర్ఘకాలిక సమస్యలకు ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. కోరుకున్న స్థాన చలనం లభించు సూచనలు ఉన్నవి. బంధు మిత్రుల సహకారంతో మానశిక ఆనందం లభిస్తుంది. ద్వితీయ వారం నుండి ధనాదాయం పెరుగును. జీవన ప్రమాణాలలో ఉన్నతి ఏర్పడుతుంది. కుటుంబంలో చక్కటి అవగాహన ఉండుట తృప్తిని ఏర్పరుస్తుంది. పుత్ర సంతాన సౌఖ్యం ఏర్పడుటకు సూచనలు ఉన్నవి. తృతీయ చతుర్ధ వారాలలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. సుఖ దుఃఖాలు సమానంగా ఉండును. వ్యవసాయం వలన ఆశించిన లాభములు కలుగును. మిత్రులతో మరియు శత్రుత్వం కలిగిన వారితో సమాగమము కలుగును. ఈ మాసంలో 20,21,25,27 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2022 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలవు. ధనాదాయం సామాన్యం. చర్మ వ్యాధి వలన లేదా చోరుల వలన ధన నష్టం ఎదురగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు ఉండదు. కానీ కొత్త బాధ్యతలు ఏర్పడుట లేదా శ్రమ అధికం అగుట వంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. భోజన సౌఖ్యం తగ్గుతుంది. వృధాగా అధిక ధనం వ్యయం అవుతుంది. ముఖ్యంగా 16.17,18 తేదీలలో నిరుత్సాహ పరిచే సంఘటనలు ఎదురగు సూచనలు ఉన్నవి. వ్యక్తిగత జీవితంలో చేజేతులారా సమస్యలు ఏర్పరచుకుంటారు. మనస్సును అదుపులో పెట్టుకొని నిర్ణయాలు తీసుకొనుట మంచిది. ఆర్ధిక ప్రతిబంధకాలకు మానసిక సంసిద్ధత అవసరం. వనములందు సంచరించునపుడు జాగ్రత్త అవసరం.

జనవరి 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ధనాదాయం సామాన్యం.మొదటి అర్ధభాగం అంతగా అనుకూల ఫలితాలు ఏర్పరచదు. గృహ సంబంధ విషయాలలో ప్రతికూల వాతావరణం కొనసాగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల వలన ధన వ్యయం పెరుగుటకు సూచన ఉన్నది. మాస మధ్యమం నుండి బాగుండును. వ్యాపారులకు మాత్రం సామాన్య ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నములకు దైవానుగ్రహం లభిస్తుంది. శుభవార్త వింటారు. 22 నుండి 27 వ తేదీల మధ్య నూతన ఆభరణములు కొనుగోలు చేయు సూచన. వివాహ ప్రయత్నాలు ఫలించును. బంధు వర్గం వలన వివాహ సంబంధాలు కుదురును. దారాపుత్రుల వలన చక్కటి అభివృద్ధి లభిస్తుంది.

ఫెబ్రవరి 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యవహారాలు సమస్యలతో కొనసాగినా చివరికి ఫలవంతమై కార్య సిద్ధి ఏర్పడును. నూతన స్నేహముల వలన నూతన ఉత్సాహం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభద్రతాభావంతో కూడిన ఆలోచనలు తగ్గుతాయి. ధనాదాయం బాగుంటుంది. పరదేశ నివాస ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వర్గముల వారికి ధర్మబద్ధమైన ఆదాయం లభిస్తుంది. చివరి వారంలో ప్రశంసలు పొందుతారు. వ్యక్తిగత జీవనంలో కూడా సమస్యలు శాంతించును. ఈ మాసంలో 11,15,20 తేదీలు అనుకూలమైనవి కావు. మిగిలిన మాసం అంతా అనుకూల ఫలితాలనే ఏర్పరచును.

మార్చ్ 2023 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ప్రధమ వారంలో శిరస్శుకు సంభందించిన ఆరోగ్య సమస్యలు బాధించును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. స్థిరాస్థికి సంబందించిన తగాదాలు వలన అనవసర పట్టుదలలు ప్రదర్శించెదరు. మధ్యవర్తుల వలన సమస్యలు తీవ్ర రూపం దాల్చును.13వ తేదీ తదుపరి విలాసముల కొరకు ధవ వ్యయం చేయుదురు. వృధా ఖర్చులు అధికం అగును. ఫలితం లేని చర్చలలో పాల్గోనేదురు.

  • మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు...
  • తులారాశి స్వభావం...
  • చిత్త జన్మ నక్షత్ర స్వభావం...
  • స్వాతి జన్మ నక్షత్ర స్వభావం...
  • విశాఖ జన్మ నక్షత్ర స్వభావం...
  • 2022 - 2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర గంటల పంచాంగం...
  • ఇతర రాశుల 2022 -2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశీ ఫలితాలు...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.